SAKSHITHA NEWS

సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో


పవన్‌, చంద్రబాబు కలయిక ఊహించిందే

  • రాజకీయాల్లో రోజుకో పాత్ర పోషిస్తున్న పవన్‌
  • టీడీపీ, జనసేన, బీజేపీ వల్ల ఒరిగేదేమీ లేదు
  • 2019లో ఆ పార్టీలను ప్రజలు ‘క్విట్‌’ చేశారు
  • 2024లో మరోసారి వైసీపీ విజయం ఖాయం
  • ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

  • సాక్షిత అనంతపురం, : జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ సినిమాల్లో హీరోయేనని, కానీ రాజకీయాల్లో మాత్రం జీరో అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పవన్‌ వ్యహరిస్తున్నాడని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతూనే ఉన్నారని, ముసుగు తొలగించి వాళ్లిద్దరూ బయటకు వచ్చేశారని తెలిపారు. నగరంలోని 24వ డివిజన్‌లో కార్పొరేటర్‌ రామాంజినేయులుతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూనే స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారికి పవన్‌, చంద్రబాబు కలయిక ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు.
  • పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, ప్రజలు కేవలం సినిమా నటుడిగానే ఆయన్ను చూస్తున్నారన్నారు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు, ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టాక కూడా రాజకీయాలను నటనగానే పవన్‌కళ్యాణ్‌ చూశారని అన్నారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఆ ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైఫల్యం చెందారని గుర్తు చేశారు.
  • అందుకోసమే 2019 ఎన్నికల్లో ఆ పార్టీలను ప్రజలు ‘క్విట్‌’ చేశారన్నారు. అసభ్య పదజాలంతో చెప్పు చూపిస్తూ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన తీరు ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. తాము కూడా అలా మాట్లాడగలమని, కానీ సంస్కారం అడ్డొస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.
  • కేవలం రాజకీయ మనుగడ కోసమే తప్పితే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం వాళ్లు ఒకటి కావడం లేదని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 2024 ఎన్నికల్లో మరోసారి ప్రజామద్దతులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్‌ మహమ్మద్‌ వసీం, కమిషనర్‌ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ ఓబిరెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.