SAKSHITHA NEWS

హెల్మెట్ భారం కాదు_ భరోసాకల్వకుర్తి ఎస్సై ఏ.రమేష్*మే 15 సాక్షిత ప్రతినిధి.

ప్రాణం ఎంతో విలువైనది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

ముఖ్యంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలి

నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తేఎంతటివారైనాఉపేక్షించేది లేదుకల్వకుర్తి ఎస్ఐ. ఏ.రమేష్

డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని మైనర్లకు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి ఎట్టి పరిస్థితుల్లో వాహనం ఇవ్వద్దని త్రిబుల్ రైడింగ్ చేయొద్దని సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో హెల్మెట్ పై అవగాహన కల్పించిన కల్వకుర్తి ఎస్ఐ ఏ. రమేష్. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ ఉండడంవల్ల ప్రాణాపయం ఉండదని మన ప్రాణాలు మన కంటే మనపై ఆధారపడిమనకోసంఎదురుచూస్తున్న మన కుటుంబ సభ్యులకు చాలా ముఖ్యమని తెలపాలి. ముఖ్యంగా మైనర్ యువకులకు బైకులు ఇవ్వద్దని ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత యువకులు బైకులను మితిమీరిన వేగంతో నడిపితే లైసెన్స్ తో పాటు వాహనలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఉరుకులు పరుగులజీవితంలోవేగానికిఉన్నప్రాధాన్యతభద్రతకుఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదని చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండుప్రాణాలుగాలిలోకలిసిపోతున్నాయని ప్రమాదాల బారి నుండి తప్పించుకోండి హెల్మెంట్ తప్పక ధరించండి అంటూ హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే చర్యలు తప్పవని రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతి చెందిన గాయాలైన సందర్భాల్లో నిత్యం చూస్తున్నామని అవగాహన లేని మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారని నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ముందస్తు జాగ్రత్తలు భాగంగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడు కోచ్చని ఎస్సై ఏ రమేష్ తెలియజేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడం మరియు రైడర్ ను కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.


SAKSHITHA NEWS