హలో దళిత ఛలో బాపట్ల కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర దళిత సంఘం నాయకులు

Spread the love

బాపట్ల జిల్లా

హలో దళిత ఛలో బాపట్ల కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర దళిత సంఘం నాయకులు

హలో దళిత ఛలో బాపట్ల కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర దళిత సంఘం నాయకుల ఈరోజు బాపట్ల టౌన్ అంబేడ్కర్ భవనం నుందు విలేఖరుల సమావేశంలో ఏ.యన్. పి. ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చార్వాక మాట్లాడుతూ డా.బీ.ఆర్.అంబేడ్కర్ 132 వ జయంతి వారోత్సవాల ముగింపు సభ మే 14 తేదిన ANPS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బి ఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల లో విస్తృతంగా పర్యటించి రాష్ట్రలో ఉన్న దళిత నాయకులను బాపట్లకు ఆహ్వానించి బాపట్లలోని చీల్ రోడ్డు నుండి డా. బి.ఆర్ అంబేడ్కర్ 25 అడుగుల విగ్రహం వరకు ర్యాలీ అనంతరం బహిరంగసభ ఈ సభకు జరుగుతుంది అన్నారు. ఈసభ కు ముఖ్య అతిధులుగా దాసరి చెన్నకేశవులు మనరాజ్యం పార్టీ అధ్యక్షులు, మల్లెల వెంకట్రావు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, గోళ్ళ తరుణకుమార్ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, యన్.మోహన్ కుమార్ ధర్మా ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, చందోలు శోభారాణి హైకోర్టు న్యాయవాది పాల్గొంటారు అన్నారు.ఈకార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను జిల్లా లో ఉన్న వివిధ దళిత సంఘాల నాయకులతో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో బాపట్ల జిల్లా సిపిఐ సీనియర్ నాయకులు జల్లి భాగ్య శ్రీధర్, మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి శీలం రోజన్ బాబు, బిజెపి యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ చైతన్య, సమతా సైనిక రాష్ట్ర ఉపాధ్యక్షులు దగ్గుపల్లి శ్రీకర్, బీఎస్పీ నాయకులు కోటేశ్వరరావు, వినయ్, రాజారావు,దాసరి లక్ష్మి పాల్గోన్నారు.

Related Posts

You cannot copy content of this page