హైదరాబాద్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది..
ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమతించడం జరిగింది. ఇతరులకు ఎవరికి స్ట్రాంగ్ రూమ్‌లోకి అనుమతి లేదన్నారు. ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరిగింది..