Health is a kiss no industry
ఆరోగ్యమే ముద్దు .. పరిశ్రమ వద్దు ..!
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని నారువ పంచాయతీలో ఏర్పాటు చేయనున్న ఎన్.ఏసీ.ఎల్ పరిశ్రమ మా గ్రామంలో పెట్టడానికి వీలులేదని సోమవారం గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు,యువత మాట్లాడుతూ తలపెట్టిన పరిశ్రమ పెట్టడానికి గ్రామం తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారని, పరిశ్రమ వలన రెడీయేషన్ తో పాటుగా తీవ్ర కాలుష్యం భారిన పడి అనారోగ్యాలకు గురవుతామని,మా గ్రామానికి అనుకోని ఉన్న చెరువులో నీటిని త్రాగుతున్నామని, పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన త్రాగే నీరు కూడా కలుషితం అవుతుందని ఆందోళన చేశారు.పరిశ్రమలో ఉద్యోగాల కన్నా ఆరోగ్యం ముద్దని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం యువత మాట్లాడుతూ ఇదివరకు జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో తీర్మాన సభ నిర్వహించారని,దీనికి గ్రామంలో అందరూ మద్దతు తెలపలేదని,చాలా మంది యువత మేజిస్ట్రేట్ వద్ద సమస్యలను చెప్పడానికి వెళితే పోలీసులు నిలువరించారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు,విద్యావేత్తలు మా గ్రామానికి అండగా ఉండాలని పరిశ్రమ ఏర్పడితే రాబోయే అనర్ధాలు క్లుప్తంగా గ్రామ ప్రజలకు,తదితర ప్రాంతాల వారికి తెలియజేసేలా పాటుపడాలని గ్రామంలోని వారు కోరారు.