పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21

Spread the love

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21 (ఫ్లాగ్ డే) పురస్కరించుకొన

ఫోటోగ్రఫీ,
షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం

—— జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబరు 21 (ఫ్లాగ్ డే)ను పురష్కరించుకుని అక్టోబరు 21st నుండి 31 st వరకు విది నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరులను స్మరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలిపారు.

అందులో భాగంగా జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని విధ్యార్థిని, విధ్యార్థులకు,
యువతకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది.


ఈ పోటీలకు విద్యార్థులతో పాటు,యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగ పాల్గొనాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

ఈ పోటీలకు చివర తేది ఈ నెల 21వ తేది లోగా నిర్ణయించగా అలాగే ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ (3 నిమిషాల నిడివి గల)

పోటీలకు సంబంధించి
రోడ్డు ప్రమాదాలు
సైబర్ నేరాలు
ఈవ్ టిజింగ్,ర్యాగింగ్
కమ్యూనిటీ పోలీసింగ్
మూడనమ్మకాలు,ఇతర సామాజిక రుగ్మతలు
ఆత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన
ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ
ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలు సంబంధించి గత సంవత్సరం అనగా 2021 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలను, షార్ట్ ఫిలిమ్ (3 నిమిషాల నిడివి గల) తమ పూర్తి వివరాలతో పెన్ డ్రైవ్ లో కానీ DVD లో కానీ
ఈ నెల 21వ తారీఖులోపు జిల్లా పోలీస్ కార్యాలయములోని PRO సెక్షన్ నందు ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.

పోటీలో గెలుపొందిన ముగ్గురికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది

సమాజంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్య పాల్గొన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page