chandra ఘనంగా డాక్టర్స్ డేబీదన్ చంద్ర రాయ్ జయంతి వర్ధంతి
chandra వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే నిర్వహించడం జరిగింది.
chandra ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ
డాక్టర్ అంటే దేవుడు ,బ్రహ్మ పంపిన మనిషి,స్వార్థం ఎరగని జీవి, నిస్వార్ధమైన యోగి ,మనకు జన్మనిచ్చేది తల్లి , తండ్రి బాధ్యత నేర్పును గురువు జ్ఞానం నేర్పును, అవసరమైనప్పుడు తగిన చికిత్స చేసి పునర్జన్మ నిచ్చేది వైద్యుడు అందుకే మన సమాజంలో వైద్యుని భగవంతునితో పోలుస్తాము ఎంతో నిబద్ధత ఓర్పు సేవానిరతితోపనిచేసే వైద్యుల సేవలను గుర్తించి గౌరవించాలని అన్నారు.
బీదన్ చంద్రరాయ్ జూలై 1.1882వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో జన్మించారు జులై 1 .1962 సంవత్సరంలో మరణించారు.
బ్రిటన్ లో వైద్య విద్యను అభ్యసించి కలకత్తా మెడికల్ కాలేజీలో కొంత కాలం ప్రొఫెసర్ గా పని చేశారు తర్వాత జాదవ్ పూర్ టీబీ హాస్పిటల్ ను ,ఆర్ జి ఆర్ మెడికల్ కాలేజీని, కమలాన్ నెహ్రూ హాస్పటల్ ,చిత్తరంజన్ లో క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించారు.
మహిళలకు పిల్లల కోసం చిత్తరంజన్ లో సేవాసదన్ అనే వైద్యశాలను ఏర్పాటు చేశారు తరువాత జాదవ్ పూర్ నుండి ఎమ్మెల్యేగా కలకత్తా నగరానికి మేయర్ కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్ మెడికల్ కౌన్సిల్ కు అధ్యక్షుడయ్యారు 1948లో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు వైద్య వృత్తి ద్వారా రోగులను , రాజకీయ ద్వారా సమాజాన్ని చికిత్స చేసిన గొప్ప వ్యక్తి.
ఈయన సేవలకు గుర్తింపుగా 1961 లో భారతరత్న పురస్కారాన్ని పొందారు ప్రతి సంవత్సరము అంకితభావంతో పనిచేయుచున్న వైద్యులకు ఈయన పేరు మీద బీ.సీ రాయ్ అవార్డును ప్రధానం చేస్తారు బి సి రాయ్ జన్మదినాన్ని జాతీయ డాక్టర్స్ డే గా జరుపుకుంటారు.
ఈ కార్యక్రమంలో
కవి శ్రేష్టుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ
జిల్లా ఎస్ఎస్సి మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు
తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు
జిల్లా మైనార్టీ సంఘం నాయకుడు బాలేమియా
రజక సంఘం రాష్ట్ర నాయకుడు ఇటిక్యాల బండలయ్య
రెడ్డి సేవా సమితి నాయకుడు రఘునాథ్ రెడ్డి
ఆర్యవైశ్య సంఘం నాయకుడు ఎలిశెట్టి శ్రీదర్
విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app