SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం

అంబరాన్ని అంటిన హనుమాన్ జయంతి సంబరాలు త్రిపురాంతకం:-త్రిపురాంతకం పట్టణంలో హనుమత్ జయంతి పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్,హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ,వాసవీ సేవా దళ్,బాల త్రిపుర సుందరీ సేవ,సత్యసాయి సేవ వాసవీ క్లబ్ ఆద్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.మహిళా మూర్తులు హిందు బందువులు హనుమాన్ జెండాలు పట్టుకొని పట్టణంలో హనుమాన్ సెంటర్ నుండి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు అక్కడ నుండి ఎన్ఎస్పీ నందు గల వడియ రాజులు నిర్మించిన ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు.జై శ్రీరాం జైజై శ్రీరాం అంటూ రామ లక్ష్మణ జానకీ జై భోలో హనుమానుకీ అంటూ స్వామి వారి నినాదాలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్దలతో శోభాయమానం హనుమాన్ శోభాయాత్ర కొనసాగింది.

అనంతరం ఆంజనేయ స్వామి దేవస్థానంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.పారాయణం అనంతరం సంస్కృత పండితుల రాధాకృష్ణ మూర్తి శ్రీ రామ లీలామృతం గూర్చి రాముని గొప్పతనం గూర్చి ఆంజనేయ స్వామి దీరత్వం గూర్చి వివరించారు.అర్చకులు దూపాటి విశ్వ నారాయణ శాస్త్రి సనాతన ధర్మ వైభవం గూర్చి భక్తి మార్గం గురుంచి భక్తులకు వివరించారు.అనంతరం తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వి హెచ్ పి కందుల వెంకట రమణారెడ్డి ,హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా సభ్యులు యామర్తి ధనుంజయరావు ,రిటైర్డ్ ఉపాధ్యాయులు టి మల్లారెడ్డి,ఎలుగూరి రామ చంద్రయ్య,గురుస్వామి,గుడిపాటి మధు,స్వరాజ్య లక్ష్మి మహిళలు చిన్నలు పెద్దలు పాల్గొని జయప్రదం చేశారు.


SAKSHITHA NEWS