SAKSHITHA NEWS

మానవత్వం లేని మనుషుల ప్రవర్తించిన కల్వకుర్తిTS.09UA 6118. అంబులెన్స్ 108కు ఉన్న సిబ్బంది
సాక్షిత : మానవత్వం చాటుకున్న రిపోర్టర్ హబీబ్*

పేషెంట్ ని కనీసం ముట్టుకోకుండా అసభ్య పదజాలాలు వాడుతున్న 108 సిబ్బంది
తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్పిటల్ లో ఇలాంటి సిబ్బంది నియమిస్తున్నారా? కొందరు రాత్రి వేళల్లో తాగి కూడా 108 లో ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలాలకు వెళ్తున్నారని సమాచారం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అశోక టాకీస్ ఎదురుగా ఎద్దులపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ సుహా తప్పి పడిపోవడం జరిగింది. ఎంతోమంది అటువైపు నుండి వెళ్తున్న పట్టించుకోవడంతో 14.04.2023 రాత్రి ఏడు గంటల నుండి 15.04.2023 ఉదయం 9:30 వరకు అలాగే రోడ్డుపై పడి ఉంది. చాలామంది దగ్గరికి వెళ్లి చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఆమెకు సాయం చేయాలని చూడలేదు. రిపోర్టర్ హబీబ్ మానవత్వంతో 108 కి కాల్ చేయగా 108 కల్వకుర్తి సిబ్బంది రావడం జరిగింది కానీ వారి మాట తీరు.నిర్లక్ష్యం సమాధానాలు

. రెండు రోజులుగా నిస్సహ స్థితిలో పడి ఉన్న మహిళ పట్టుకొని అంబులెన్స్ లో వేయడానికి కూడా 108 సిబ్బంది ముందుకు రాలేదు. అసలు పేషెంట్లను మేము తీసుకెళ్లాము అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పారు. రిపోర్టర్ హబీబ్అంజమ్మను 108 లోకి ఎక్కించడం జరిగింది. కల్వకుర్తి 108సిబ్బందినిర్లక్ష్యపుసమాధానాలు. మానవత్వం లేని మనుషుల ప్రవర్తించడం108 సిబ్బంది పేషంట్.పట్లఅంటరానితనంగా వ్యవహరించడం కనీసం పేషెంట్ ను ముట్టుకోకుండా ప్రవర్తించడం చాలా బాధాకర విషయం. వీళ్లు మన ప్రభుత్వ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారా అనే అనుమానాలు వచ్చాయి.గవర్నమెంట్ జీతాలు ఇచ్చి ఇలాంటి వాళ్లను నియమిస్తుందా? జరగరాని ప్రమాదం జరిగినప్పుడు వీరి నిర్లక్ష్యం వల్ల పేషంట్ ప్రాణాలు పోతే బాధ్యత ఎవరు వహిస్తారు? నేను ఉపవాస దీక్షలో ఉన్నాను కొంచెం పట్టండి అన్నా అని చెప్పిన 108 సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం. అసలు 108 సిబ్బందికి మానవత్వం ఉందా అనే విధంగా అనిపించింది. ఇదంతా గమనిస్తున్న అక్కడ ఉన్న ప్రజలు పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కల్వకుర్తి 108 సిబ్బందిని తక్షణమే తొలగించి కొత్తవారిని నియమించాలని ఈ విధంగా ఇంకోసారి జరగకుండా చూడాలని కోరడం జరిగింది.


SAKSHITHA NEWS