ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ సీనియర్ నేతకు రాజకీయంగా మంచి పట్టు ఉంది. సుమారు 30 ఏళ్లకు పైగా రాజకీయాలలో చక్రం తిప్పాడు. 12 నియోజకవర్గాల్లో కూడా తనకంటూ ప్రత్యేక అనుచరుగణం ఉంది.
కానీ గత కొంతకాలంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తను రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడే వారసుడిని ప్రమోట్ చేసి వారసత్వాన్ని నిలపాలని భావించారు. కానీ సొంత పార్టీలోనే తన వ్యతిరేకవర్గం కొడుకుకు టికెట్ రాకుండా అడ్డుకోవడం తోపాటు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో ఆ సీనియర్ నేతలు ఒంటరి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత మరెవరో కాదు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.