కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లి డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో BKR ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టీపీసీసీ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొగునూరి కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మెగా హెల్త్ క్యాంపును పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలను అభినందించారు. ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమాజ సేవా దృక్పథంతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న BKR ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
