గోల్కొండలో జరిగిన శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల తొట్టెల ఊరేగింపు

Sakshitha news

గోల్కొండలో జరిగిన శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌

గోల్కొండకు చెందిన రాఘవ, రాహుల్, వరుణ్ తేజ్, ఎల్‌ఎన్‌ఆర్ వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీ జగదాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కృపాకటాక్షాలు ఆయురారోగ్యాలతో అందరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..

ఈ సందర్భంగా తొట్టెల ఊరేగింపు నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో నేమూరి రాములు గౌడ్ మరియు క్యాతం అశోక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Scroll to Top