ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్య సేవలు కల్పించాలి: జేఏసీ డిమాండ్….

Sakshitha news

ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్య సేవలు కల్పించాలి: జేఏసీ డిమాండ్….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, ఎన్‌టీపీసీ రామగుండం మరియు తెలంగాణ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్‌ఐ (ESI) వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (JAC) డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు ఎన్‌టీపీసీ రామగుండం చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ)కు వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో వారు పేర్కొన్న వివరాల ప్రకారం, ఎన్‌టీపీసీ సంస్థలో శాశ్వత ఉద్యోగులతో పాటు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కార్మికుల వేతనాల నుంచి ఈఎస్‌ఐ నిధులు క్రమం తప్పకుండా మినహాయిస్తున్నప్పటికీ, వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య చికిత్స, పరీక్షలు, మందులు మరియు ఇతర ఆరోగ్య సేవలను అందించాలని కోరారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవి:
1).కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఎన్‌టీపీసీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలి.2).ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న కార్మికులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి.3).కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.4).అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి.

ఈ సమస్యను యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. కార్మికుల సంక్షేమం కోసం అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ‌ జేఏసీ నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి‌ ,బూమల్ల చందర్, దగ్గుల సత్యం, చింతల సత్యం‌, ఇజ్జగిరి భూమయ్య , త్రి దండపాణి శ్రీనివాస్, ఆలేటి శ్రీనివాసు ‌, జమీల్ భాయ్, శంకర్ పురుషోత్తం, డి.కృష్ణమూర్తి తో పాటు పలువురు పాల్గొన్నారు

Scroll to Top