సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న కోనేరు పూర్ణచంద్రరావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

Sakshitha news

సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న కోనేరు పూర్ణచంద్రరావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి కీ.శే. కోనేరు నాగేశ్వరరావు తనయుడు, కోనేరు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు పూర్ణచంద్రరావు (పెద్దబాబు) జన్మదిన వేడుకలు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, యువజన సంఘాల నాయకులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.


కోనేరు ట్రస్టు ద్వారా పేదలకు అన్నదానం, వస్త్రదానం, కుట్టు మిషన్ల పంపిణీ, విద్యార్థులకు విద్యా సహాయం, వైద్య సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పలువురు పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారని కొనియాడారు.
కొత్తగూడెం లయన్స్ క్లబ్‌లో పలు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన ఆయన, ఇటీవల కొత్తగూడెం క్లబ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా కోనేరు పూర్ణచంద్రరావు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ప్రజలకు సేవ చేయాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షించారు

Scroll to Top