గోదావరిఖనిలో సాహు మహారాజ్ జయంతి, రిజర్వేషన్స్ డే వేడుకలు….
పట్టణంలో సాహు మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, దేశంలోనే తొలిసారిగా తన కొల్హాపూర్ సంస్థానంలో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన జయంతి, రిజర్వేషన్స్ డే సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, ప్రముఖ అంబేద్కర్‌వాది మంతెన మధు మాట్లాడుతూ, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారానే సమాన అవకాశాలు కల్పించవచ్చని విశ్వసించి 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన దూరదృష్టి కలిగిన పాలకుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యాభ్యాసానికి ఆర్థిక సహకారం అందించి, ఆయన సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచిన మహనీయుడు సాహు మహారాజ్ అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గోదావరిఖని పట్టణంలో ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, ఏఐటీయూసీ, డీఎస్పీ, సింగరేణి ఎస్సీ–ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామికి విజ్ఞప్తి చేశారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెగడపల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు కంపెల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య, ఏఐటీయూసీ నాయకులు కందుకూరి రాజారత్నం, ఆకునూరి బాలంకుస్, బూడిద సమ్మయ్య, బూడిద మహేందర్, పుల్లూరి మహేందర్, ఎం.ఏ. కరీం, శనిగారపు చంద్రశేఖర్, పొనుగంటి రాజనర్సు, శనిగారపు రామస్వామి, జనగామ శంకర్, శనిగారపు పోచయ్య, కనకం గణేష్, పంజా అశోక్, కోరే శంకర్, కలువల రాజేశం, దొమ్మటి శేఖర్, రామగిరి రమేష్, కల్వల మహేందర్, పెరిక రవి, బొంకూరి పవన్ కుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
