విజయవాడలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ కనకదుర్గ దేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ కనకదుర్గ దేవి దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ వేద పండితుల ఆశీర్వచనల మధ్య అమ్మవారి ఆశీస్సులు పొందారు..
— శ్రీ శ్రీ కనకదుర్గ దేవి దేవస్థానం ఈవో మాజీ ఎమ్మెల్యే కి చిరు జ్ఞాపకాన్ని అందజేశారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ , టిపిసిసి సభ్యులు సీతారాం ప్రవీణ్ ,మల్లేశ్ గౌడ్, బుచ్చిరెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
