రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ల దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని

Sakshitha news

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ల దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని చేపట్టిన బిజెపి శ్రేణుల ను అడ్డుకున్న పోలీసులు

  • జిల్లాకాంగ్రెస్ పార్టీ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని లేకుంటే న్యాయపోరాటం తప్పదని బిజెపి హెచ్చరిక

పార్టీల మధ్య తగవులు పెడుతున్న కొత్త బిచ్చగాళ్లు

……
సాక్షిత వనపర్తి :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం శవయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల వైఖరిని ఖండిస్తూ బిజెపి ఆధ్వర్యంలో గురువారంరాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం శవయాత్రకార్యక్రమాన్ని తలపెట్టగా జిల్లా పోలీసు శాఖ పెద్ద ఎత్తున బిజెపి జిల్లా ఆఫీసు పై దాడి చేసి ఆఫీసుకు తాళం వేసి కార్యకర్తలను చెల్లాచెదురు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా పార్టీ కార్యాలయం నుండి స్థానిక రాజీవ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే క్రమంలోఓ దశలో పోలీసులకి నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం విశేషం
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ మాట్లాడుతూ వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర,దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం అవినీతి రహిత పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ ని ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ పన్నిన కుట్రలో భాగంగా రాష్ట్ర పీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆదేశాలతోనే వనపర్తి లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం దేశద్రోహ చర్య కిందికి వస్తుందని కాంగ్రెస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఓట్ల చోరీ ఈవీఎం లేదా వనపర్తి అభివృద్ధి ఏదైనా బహిరంగ చర్చకు రావాలని వనపర్తి రాజకీయాల్లో శాంతిభద్రతల సమస్యలు నాయకుల మధ్య గ్రూపు తగాదాలు గతంలో లేవని కానీ నేడు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరిన కొత్త బిచ్చగాళ్లు నాయకుల మధ్య పార్టీల మధ్య తగవులు పెట్టడానికి చూస్తున్నారని మీరు దిష్టిబొమ్మల దగ్ధం చేయవచ్చు బీజేపీ తలుచుకుంటే మీ ఇంటి ముందుకు వచ్చి మీతో బాహాబాహీకి కూడా సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
సోమవారం జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, స్పందించి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి దిష్టిబొమ్మకు జిల్లా కేంద్రంలో అర్థ కిలోమీటర్ పొడవున శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారని, ఆధునిక టెక్నాలజీలో సీసీ కెమెరాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగే సంఘటనలను కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే పోలీసు డిపార్ట్మెంట్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి అత్యంత రద్దీగా ఉండే రాజీవ్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్వహిస్తుంటే దానిని ఆపకపోవడం ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యమేనని జరిగిన వ్యవహారంపై సుమోటోగా జిల్లా ఎస్పీ స్వీకరించి విచారణ జరిపించి
బాధ్యు లైన కాంగ్రెస్ నాయకులపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టి జైలుకు పంపించాలని లేని పక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది ఎన్. రామచంద్ర రావు సలహాలు సూచనలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు న్యాయస్థానాలలో ఫిర్యాదులు చేసి దిష్టిబొమ్మ దగ్ధం కేసులో నిందితులకు శిక్షపడే దాక పోరాటం చేస్తామని హెచ్చరించారు అనంతరం రాజీవ్ చౌరస్తా నుండి బిజెపి నాయకులను పట్టణ పోలీస్ స్టేషన్కు నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల రామన్ గౌడ్ కోశాధికారి భాసెట్టి శీను మోర్చాల రాష్ట్ర నాయకులు కదిరే మధు అలివేలమ్మ మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధ అధికార ప్రతినిధులు పెద్ది రాజు గజరాజుల తిరుమలేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గోపీనాథ్ యాదవ్ కాటమొని కృష్ణ గౌడ్ డి.నారాయణ పోగు సుబ్రహ్మణ్యం జంగం సురేందర్ వెంకటేష్ నాయుడు పట్టణ ప్రధాన కార్యదర్శి దంతోజు నవీన్ నల్లవతుల అరవింద్ ఉపాధ్యక్షులు ఉపేందర్ యాదవ్ కోశాధికారి కూన శ్రీకాంత్ కార్యదర్శులు కడమంచి శివ అశ్విని పవన్ కే చంద్రశేఖర్ గోవింద్ చిన్న రాయుడు యువమోర్చా పట్టణ అధ్యక్షుడు మండల రాజు ఎస్సీ మార్చ పట్టణ అధ్యక్షుడు అగపోగు చాణిక్య మండల రాఘవేందర్ పుష్పక్ యాదవ్ యుగంధర్ సాగర్ సూర్యవంశం శీను బొడ్డుపల్లి కొండన్న మహేష్ గౌడ్ కట్రావతి వెంకటేష్