జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా షడ్ రుచులు (ఆరు రకాలు) తీపి, పులుపు,కారం, ఒగరు, చేదు, ఉప్పులతో ఉగాది పచ్చడి తయారు చేసి, సరస్వతి దేవి కి పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని విద్యార్థులకు అంద జేశారు.
తర్వాత విద్యార్థులు వివిధ పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టత, పద్ధతులు, ఆరు రకాలు రుచుల గురించి విద్యార్థులకు తెలుపడం జరిగిందనీ, ఉగాది పండుగ రోజున ఉదయం లేచి కొత్త బట్టలు ధరించి ప్రతీ ఒక్కరు దేవాలయం కు వెల్లి దర్శనం చేసుకొంటారని,సాయంత్రము వివిధ ఆలయాలలో పంచాంగ శ్రవణంను ఆలయ పూజారులు వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి,,ఉపాద్యాయులు స్వర్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.