SAKSHITHA NEWS

రేజోనేన్స్ శ్రీనివాస నగర్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం శ్రీనివాస నగర్ లో గల పాఠశాలలో చాలా ఘనంగా హిందీ దివస్ ను ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నారు. మన జాతీయ బాషా (నేషనల్ లాంగ్వేజ్) గా పేరుగాంచిన “హిందీ” బాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. ఇందుగల కారణం 1949వ సం// సెప్టెంబర్ 14 న తేదీన హిందీ బాషను అధికార బాషగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది దేవానాగరిక లిపి నుంచి రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ మరియు నీలిమ విద్యార్థులను ఉద్దేసించి మాట్లాడుతూ విద్యార్థులందరికీ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచములోని ఎక్కువగా మాట్లాడే బాషలలో హిందీ బాషా రెండవది కావడం, ఇది మనమందరం గర్వించదగ్గ విషయం మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశంలో ఐక్యతను తీసుకరావడానికి హిందీ బాషనే వాడేవారు.

ఈ బాషను “లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ” అనే వారు అంత గొప్పది మన హిందీ బాషా. అందుకే అన్నారు “మేరా భారత్ మహాన్” అని……. కాబట్టి మీరందరూ హిందీ మాట్లాడడం, రాయడం నేర్చుకోగలిగితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన బాషా సమస్య లేకుండా జీవించవచ్చు అని తెలియజేసారు. ఈ 3 కార్యక్రమంలో విద్యార్ధులందరూ కూడా ఆట, పాటలతో, పాటు హిందీ దివస్ గురించి ఎన్నో తెలియని విషయాలను ఉపన్యాసాల ద్వార తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు వేడుకను ఘనంగా జరుపుకున్నారు


SAKSHITHA NEWS