SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 29 at 3.59.05 PM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించి, నిత్యావసర సరుకులను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గురుగోవింద్ సింగ్ నగర్, PJR నగర్ ఫేస్ 1 కాలనీ లలో గల వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , CI క్రాంతి కుమార్ మరియు GHMC అధికారులతో కలిసి పరిశీలించి,ఇంటింటికి వెళ్లి యోగ క్షేమలు తెలుసుకొని నిత్యావసర సరుకులను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని, ఎవరు అధైర్య పడకూడదని ,మీకు అన్ని విధాలుగా అండగా అండగా ఉంటామని, అందరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాడం జరుగుతుంది అని, వర్షాలు పడగానే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాయమాటలు చెప్పేవారిమి కాదని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సంక్షేమం కోసం పనిచేసే వారిమని, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొందరు స్వార్థపరులు బురద రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.


గత 9 ఏళ్లుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అనునిత్యం ప్రజాలతోనే మమేకమై ఉంటూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానిదని, ఎడతెరపి లేని వర్షాలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు నాయకులు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని వారంతా టూరిస్ట్ లని హెద్దేవా చేశారు ప్రభుత్వ గాంధీ . తాను తమ పార్టీ ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఆల్విన్ కాలనీ అభివృద్ధి కోసం సుమారు రూ.180 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. లో లెవల్ లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరిందని, అప్పటికే ఒక మీటర్ లోతు మేర పైప్ లైన్ వేసిన పైన నుండి భారీగా వచ్చిన వరదకు తోడు, నీటి ప్రవాహానికి అడ్డంగా కట్టిన ఓ బిల్డింగ్ వల్ల సిక్కుల బస్తీలో ఇళ్లలోకి నీరు చేరిందని, ఆ బిల్డింగ్ ఎలా కట్టారు. దానికి ఎవరు అనుమతులు జారీ చేశారు అన్నదానిపై ఇప్పటికే జోనల్ కమిషనర్ విచారణ చేపట్టారని, భవిష్యత్తులో అలాంటి నిర్మాణాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వ విప్ గాంధీ .

దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇంతటి భారీ వర్షానికి కేవలం మూడు చోట్ల మాత్రమే సమస్యలు తలెత్తాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.గతంలో వర్షాలకు దీప్తి శ్రీ నగర్ నాల, ధరణి నగర్ నాల, మాదాపూర్ సిటీ వైన్స్ వంటి ప్రాంతాలలో వరద ముంపు పై నిత్యం వార్తలు వచ్చేవి అని, కానీ నేడు ఒక వార్తా కూడా రావడం లేదు అంటే మేము చేసిన పని నిబద్దత కు నిదర్శనం అని, దశల వారిగా పనులు పూర్తి చేశామని, అసాధ్యం పనులు సుసాధ్యం చేశామని, గత 50 ఏళ్ల చరిత్రను 9 ఏళ్లలో మార్చిన ఘనత మా బీఆర్ ఎస్ ప్రభుత్వానిదని,ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ గార్ల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజవర్గాన్ని అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని అధికారులకు తెలియచేసిన ప్రభుత్వ విప్ గాంధీ .
వర్షకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్ ,ఎమర్జెన్సీ టీమ్స్ లు అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని, , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

అదేవిధంగా ప్రజలు అందరు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమాత్రంగా ఉండలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని,ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని, భారీ వానల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెల్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ విజ్జప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, GHMC అధికారులు ఎఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్,ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, సంగమేష్, యాదగిరి, రాములుగౌడ్, వాలి నాగేశ్వరరావు, కూర్మయ్య, భిక్షపతి, సంతోష్ బిరాదర్, కె.శ్రీనివాస్, కటికరవి, సాయిగౌడ్, రాజు, లాఖన్ సింగ్, మారుతి, రాజ్యలక్ష్మి, మధు లత, శిరీష శాత్తూర్, షేక్ బీబీ, పుట్టం దేవి, రేణుక. సురేఖ. ప్రీతి, రమాదేవి, పర్వీన్, లలిత కుమారి, లక్ష్మి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS