SAKSHITHA NEWS

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు లో ఎమ్మెల్యే సతీమణి

గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి హాజరయ్యారు.

ఎమ్మెల్యే సతీమణి కి కళాశాల ప్రిన్సిపాల్, వి విద్యార్థులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు …

తర్వాత విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆడి పాడారు

ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ…..

గతంలో ఆడపిల్లలు చదువుకోవాలని ఉన్న ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతంలోని ఆడపిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లి అవసరం లేకుండా గద్వాల లోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి చదువుకోవడం వలన ఉపయోగాలు ఉన్నాయి మన మన కాళ్ళ పైన నిలబడి భవిష్యత్తులో మనుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాలలో రాణించాలని కోరారు.

కళాశాలలో గత సంవత్సర వార్షిక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన పేద విద్యార్థులకు EAMCET మరియు DIET CET మెటీరియల్ డొనేట్ చేయడం జరిగింది . అదేవిధంగా గత మూడు రోజులుగా వివిధ రకాల ఆటల పోటీలు ఆడి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది.

ఆడపిల్లలు తమ విలువ ఏమిటో తెలుసుకొని, సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధతో మంచిగా చదువుకొని త్వరలో జరగబోయే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించి మీ తల్లిదండ్రులకు మీ కళాశాలకు మన గ్రామానికి గద్వాల ప్రాంతానికి మంచి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

అందరికీ అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్ తెలిపారు…

ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇంటర్ విద్య అధికారి M. హృదయం రాజు , ప్రిన్సిపాల్ కృష్ణ సార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ G.వీరన్న , GJLA జిల్లా అధ్యక్షులు B. దేవేందర్ రెడ్డి , మహిళా నాయకురాలు రాధమ్మ మధుమతి మరియు
కళాశాల బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS