SAKSHITHA NEWS


Government Basti Davakhanas to make quality healthcare more accessible to the poor

పేదలకు నాణ్యమైన వైద్యంను మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలు

-జిల్లా కలెక్టర్ విపి గౌతమ్


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పేదలకు నాణ్యమైన వైద్యంను మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ఖమ్మం నగరం 60వ డివిజన్ రామన్నపేట లో రూ.16.40 లక్షలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పేద, మద్యతరగతి కుటుంబాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు రాష్టప్రభ్తుత్వం బస్తీ దవఖానాలను ఏర్పాటు చేస్తుందని, ప్రజలందరు సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా బస్తీలలో దవఖానాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బస్తీ దవఖానాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రస్తుతం చిన్న, చిన్న అనారోగ్య సమస్యలకు కూడా పైవేటు ఆసుపత్రులలో వేలాదిరూపాయల ఖర్చుపెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని ఆయన తెలిపారు.

పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS