Good welfare governance is possible only with CM “KCR” sir
సంక్షేమ సుపరిపాలన సీఎం “కేసీఆర్” సార్ తోనే సాధ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండల పరిధిలోని కరీంపూర్ గేట్ మైసమ్మ గుడి సమీపంలో కోట్ పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.17,01,972/- (రూపాయలు పదిహేడు లక్షల ఒక వేయి తొమ్మిది వందల డెబ్భై రెండు) విలువ గల 17 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్ చెక్కులను అందజేశారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డ పుట్టుక నుండి ప్రతి దశలో నీడలా తోడుంటూ సంపూర్ణ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.