గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..
సాక్షిత : దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ శంశిగుడా పరిధిలోని మహంకాళి నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని కాలనీ ప్రజలందరు బాధ్యత తీసుకుని వారి ఇండ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటారని, చెత్తను వీధుల్లోనూ కాలువలోను కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. కాలనీలోని ఒక గల్లీలో డ్రైనేజీ పనులు పూర్తయి సీసీ రోడ్డు నిర్మించవలసి ఉందని అదికూడా శాంక్షన్ అయి ఉంది కాబట్టి అతిత్వరలో నిర్మాణ పనులు మొదలు పెడతారని అన్నారు.
కాలనీలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు లేక రాత్రి సమయంలో కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, దాతి రమేష్, యం శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, మహేష్, ఇస్మాయిల్, యం.ఆర్.సత్యనారాయణ, రమేష్ జంపాల, షేక్ అన్వర్ బాషా, అఖిల్ ముదిరాజ్, బి జాషువా, నాగేష్, లక్ష్మీ, నాగేశ్వరరావు, హానుమంత్, నరసింహ, శైలు, శివాజీ, శివ తదితరులు పాల్గొన్నారు.