తిరుపతి నగరంలోని సమస్యలపై వచ్చేవారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించారు.
డయల్ యువర్ కమిషనర్ కు 09, స్పందనకు 20 పిర్యాధులు అందగా, వాటిలో ముఖ్యంగా కె.బి లే అవుట్లో వున్న టేంకాయల మండికి వచ్చే వాహనాల వల్ల ఇబ్బందిగా వుందని, ఎల్.ఎస్.నగర్లో రోడ్డు నిర్మించేందుకు కంకర పరిచి వదిలేసారని, శ్రీనివాసపురంలో వీధి ధీపాలు వెలగడం లేదని, ఎమ్మార్ పల్లె పంచాయితీ ఆఫిసు ప్రక్కన మురికినీరు నిలిచి పోతున్న దని, కోటకొమ్మల వీధిలో త్రాగునీటి బోరు రిపేరు చేయించాలని, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులపై కమిషనర్ స్పందిస్తూ పిర్యాధులను త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపర్డెంట్లు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.