ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇవ్వండి.
*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్
సాక్షిత : * నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులను చేసేందుకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో వివిధ రకాల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ఏ ఏ వార్డు ల్లో అభివృద్ధి పనులు ఈ మేరకు జరిగాయనే విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజినీరింగ్ అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అన్ని వార్డుల్లో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జనరల్ ఫండ్స్, 15 వ ఫైనాన్స్ నిధులన్నీ కూడా అభివృద్ధి పనులను ఉపయోగించాలని అన్నారు. ఇప్పటి వరకు అనుమతి పొందిన పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు సిబ్బందితో కలసి నిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఆయా వార్డుల్లో పర్యటించి ప్రజలకు అవసరమైన సి.సి.రోడ్లు, డ్రైనేజీ కాలువలు తదితర పనులను గుర్తించాలని అన్నారు. ఆ పనులు చేసేందుకు అనుమతులు మంజూరు చేయించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, డి. ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, రవీంద్రా రెడ్డి, నరేంద్ర, రాజు, శ్రావణి, తదితరులు ఉన్నారు.