Giridhar Aramane is the new Chief Secretary of Andhra Pradesh Government
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అరమణే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అరమణే పేరు తెరపైకి వచ్చింది. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన..ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ మేరకు గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో గిరిధర్ అరమణే ఇవాళ భేటీ అయ్యారు. కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ కేడర్ సీనియార్టీ జాబితాలో గిరిధర్ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. ఒకవేళ అరమణే సీఎస్‌గా బాధ్యతలు చేపడితే 2023 జూన్ 30 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త సీఎస్ నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు.
డిసెంబరు 1 నుంచి నూతన ప్రధాన కార్యదర్శి బాధ్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నూతన సీఎస్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.