జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ ని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న హిందు, ముస్లిం, క్రిస్టియన్ స్మశానవాటికల సుందరికరణ పనులు మధ్యలో ఆపేశారు కాబట్టి వాటిని వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని, అలాగే గోవింద్ హోటల్ సర్కిల్ నుండి వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి సిక్కుల బస్తి వరకు జరగవలసిన 100 fts రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించి రోడ్డు ను ఇరువైపులా వెడల్పు చేయకుండా వదిలేశారు. రోడ్డుకు డివైడర్ నిర్మించి వదిలేయడం వల్ల గతంలో కన్నా ట్రాఫిక్ సమస్య ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కరం చూపడం వంటి విషయాలను కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ ని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…