గ్యార్వి షరీఫ్ సామరస్యానికి, సద్భావనకు ప్రతీకగా నిలుస్తుంది – బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ..
సాక్షిత :: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ లో మొహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్వి షరీఫ్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్యార్వి షరీఫ్ సామరస్యానికి, సద్భావనకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు ఐక్యతతో కలిసి పండుగలను జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి గర్వకారణమని అన్నారు.
ప్రాంతంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ, వేడుకల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ రఫిక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మక్సుద్ అలీ, శేఖర్ రావు, వహీద్ ఖురేషి, ప్రభాకర్ గుప్తా,అఫ్సర్, షౌకత్ అలీ, సాజిద్, అల్లు, రమ్మీ గౌడ్,కాలనీ వాసులు వెంకటేష్ యాదవ్, కృష్ణ గౌడ్, మక్బూల్, సాగర్ మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
