ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడమే లక్ష్యం : ఎస్పి

Sakshitha news

ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడమే లక్ష్యం : ఎస్పి

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం జిల్లా నలుమూలల వచ్చిపోయే అన్ని మార్గాలలో నిర్వహిస్తున్న నాకాబంది కార్యక్రమాన్ని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి టేకుమట్ల గ్రామం జాతీయ రహదారి ఖమ్మం హైవే పై నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రతా రక్షణ కల్పించడం లక్ష్యంగా, ఎఫెక్టివ్ పోలీస్ మరియు విజుబుల్ పోలీసింగ్ ఉద్దేశంలో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జిల్లాలోకి వచ్చి పోయే అన్ని మార్గాలను, సరిహద్దులను అష్టదిగ్బంధనం చేసి పోలీసు నాఖాభంది నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ తెలిపారు. ఈ నాఖాభంది ద్వారా అక్రమ రవాణా, అనుమానితుల కదలికలు, రౌడీషీటర్స్ కదలికలు, గంజాయిరవాణా చేసే వారి కదలికలు, పశువుల అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర అంతర్ జిల్లా నేరస్తుల కదలికలు గుర్తించి నివారించడం, నేరాలను అదుపు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పి తెలిపినారు. దీనిలో భాగంగా జిల్లాలోని 23 ప్రాంతాలలో నాకబంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలలా ఉన్నారు సరిహద్దు ప్రాంతాలు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు రామాపురము ఎక్స్ రోడ్, దొండపాడు, పులిచింతల ప్రాజెక్టు, అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతాలు తిరుమలగిరి వెలిశాల, మద్దిరాల వద్ద కుంటిపల్లి, కోదాడ పట్టణం సూర్యాపేట పట్టణం, నూతనకల్ మండలం బిక్కుమల్ల నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, పాలకీడు జాన్పాడు వద్ద మండలం మట్టపల్లి బ్రిడ్జి ఇలా అన్ని ప్రాంతాలలో ఏకకాలంలో నాకాబంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు.

టేకుమట్ల వద్ద జరిగిన తనిఖీలలో సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పెన్పహాడ్ ఎస్సై శ్రీకాంత్, సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్, ఆర్ఎస్ఐ అశోక్, సిబ్బంది ఉన్నారు