నూతన అధ్యాయానికి శ్రీకారం… సీఎం చంద్రబాబుతో సాకారం

Sakshitha news

నూతన అధ్యాయానికి శ్రీకారం… సీఎం చంద్రబాబుతో సాకారం

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

సాక్షిత : యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రపంచం గర్వించదగ్గ సంస్థ గూగుల్‌ను రాష్ట్రానికి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కిందని కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తుండటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేలా ఎంవోయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. యంగెస్ట్ స్టేట్ గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హై ఎస్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ స్టేట్ గా నిలుస్తోందని స్పష్టం చేశారు. దేశంలోనే 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించడం ఇదే తొలిసారని అన్నారు. 12 నెలలు పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ రావడం టెక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో, ఇప్పుడు కూడా గూగుల్ విశాఖకు రావడం రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుందని ఆకాంక్షించారు. దేశం మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే.. వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ క్లౌడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సంస్థపై కూడా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఈ గూగుల్‌ హబ్ లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీ మెయిల్, యాడ్స్, క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచే ప్రపంచానికి అందించబడతాయని పేర్కొన్నారు.