వివిధ సమస్యల పై వచ్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల నుండి వినతులను స్వీకరించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….
సాక్షిత : కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గ పరిధిలో పలువురు ప్రజలు సామాజిక మరియు ప్రజా సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మాజీ ఎమ్మెల్యే కి వారి నివాసంలో అందజేశారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతులను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు.
అదేవిధంగా, నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తమ కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యే కి అందజేసి, కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
