*మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన మేడ్చల్ డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ *….
సాక్షిత : గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ (దేవేందర్ నగర్) లో అక్షర జ్యోతి మహిళ సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి *మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ * ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు…
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ *రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని దాంట్లో భాగంగానే ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తుందని మహిళలకు ఉచిత బస్సు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు మరియు ఇతర అనేక కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అని స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలలను ఉద్దేశించి మాట్లాడారు..
ఈ కార్యక్రమంలో అక్షర జ్యోతి మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎన్ పూలమ్మ, జ్యోతి, రామలక్ష్మి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు యాం సాగర్, దంపనబోయిన శ్రీనివాస్, శివప్ప, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డాన్ శీను, ఋషి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, సాగర్ మరియు కార్యకర్తలు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
