ఆటో- ఆర్టీసీ బస్సు ఢీ
ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
…..
సాక్షిత వనపర్తి :
ఆటో ఆర్టీసీ బస్సు
ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శుక్రవారంచోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి వనపర్తి వెళ్లే క్రమంలో నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్ బిజినపల్లి నుండి వట్టెం వైపు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి ఎదురెదురుగా వస్తున్న వనపర్తి డిపో ఎక్స్ప్రెస్ బస్సు ను ఆటో డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ను స్థానికులు వెంటనే 108 సాయంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. పోలీసులు ఎప్పటికప్పుడు ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగం మద్యమం సేవించి ఆటోలు నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం పైన పోలీసులు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వేళలో వాహనాల తనిఖీలలో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
