సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్
క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అదికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ .*
సాక్షిత జగిత్యాల జిల్లా… :ఈనెల 7వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖలు అయన విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. గడిచిన 11 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. గణేష్ ఉత్సవాల ను భక్తిశ్రద్ధలతో జరిపి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ వారికి సహకరించిన విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ, అధికారులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…