SAKSHITHA NEWS

గద్వాల:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రూ.4కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ లో పనులు ఇంకా అసంపూర్తిగానే మిగిలాయి. బస్టాండ్ ప్లాట్ఫారం సగం వరకే నిర్మించి వదిలేయడంతో బస్సులు రివర్స్ తిప్పుకునేందుకు డ్రైవర్లు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు.అదేవిధంగా బస్టాండ్ ఆవరణలో నిర్మించిన దుకాణ సముదాయాలు సైతం ఇప్పటివరకు ప్రారంభించలేదు, టెండర్లు కూడా వేయలేదు.

కనీసం ప్రయాణికులు దాహార్తి తీర్చుకునేందుకు గుక్కెడు మంచినీళ్ల సౌకర్యం కూడా బస్టాండ్ లో లేకపోవడంతో ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఇకపోతే బస్టాండ్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలల్లో సైతం శుచి శుభ్రత పాటించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బస్టాండ్ లో ప్రయాణికులు వీక్షించేందుకు కనీసం టీవీలు సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే అధికారులు స్పందించి ప్లాట్ ఫారం నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Whatsapp Image 2023 12 06 At 3.51.05 Pm

SAKSHITHA NEWS