SAKSHITHA NEWS

ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ శ్రీ కాళోజి నారాయణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలా వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్యలయంలో ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలా వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాళోజి నారాయణ చాలా గొప్ప ప్రజా కవి మరియు తెలంగాణ వాది అని పేర్కొనడం జరిగినది,కాళోజి 20 ఏళ్లకే దేశం కోసం జైలు వెళ్ళడానికి కూడా వెనుకాడలేదని, ఆయన రచనలు మానవాళికి స్ఫూర్తి అని అని అన్నారు. .అదేవిదంగా కాళోజి నారాయణ జ్ఞాపకార్థం మరియు తెలంగాణ కోసం అయన పడిన తపనను గుర్తించి


ముఖ్యమంత్రి కెసిఆర్ కాళోజి జయంతి నాడు తెలంగాణరాష్ట్ర బాషా దినోత్సవం గా ప్రకటించడం జరిగినది అని నేడు ఆ మహనీయుడి జయంతి సందర్బంగా తెలంగాణరాష్ట్ర బాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది అదేవిధంగా పుట్టుక నీది ,చావు నీది బ్రతుకంతా దేశానిది అని కాళోజి చేపినట్టుగానే తన దేహాన్ని మరణం తర్వాత కాకతీయ మెడికల్ కాళశాలకు ఇవ్వడం జరిగినది అని, గొప్ప మహనీయుడు అని గాంధీ గుర్తు చేసినారు .

తెలంగాణ భాషను ,నుడికారాన్ని అతిగా ప్రేమించి తన భాషే తెలంగాణ భాష అని నిక్కచ్చిగా చెప్పిన భాషాభిమాని ,ప్రజా కవి కాళోజి అని ,అయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైనదని ,ఆ మహనీయుడి జయంతిని తెలంగాణ బాషా దినోత్సవం గా జరుపుకోవడం గర్వకారణమని గాంధీ చెప్పడం జరిగినది అదేవిదంగా కాళోజి తెలంగాణ కోసం విశేషకృషి చేసారని ,ఆ ప్రజల మనిషి కి ఘనంగా నివాళ్లు అర్పిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొనడం జరిగినది , ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవాలని, ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

మరియు బీ ఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ గుప్తా జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ ఆశీర్వదించడం జరిగినది

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, చాంద్ పాషా, రజినీకాంత్,ప్రభాకర్,శ్రీహరి,రాము ,పద్మ, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దండు గుల రామకృష్ణ, మీడియా విభాగం అధ్యక్షులు ఎర్ర యాకయ్య రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్, రాష్ట్ర నాయకులు ఆనంద్ కుమార్ గుప్తా , రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ , లింగంపల్లి మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లెల జయ శ్రీ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS