జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది-నగర మేయర్ డాక్టర్ శిరీష
సాక్షిత* : ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం అందించడమే జగనన్న లక్ష్యం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది అని మేయర్ శిరీష అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లు ప్రతి కుటుంబానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25,2 డివిజన్ జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నగర మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. మేయర్ డాక్టర్ శిరీష బిపి,కంటి పరీక్షలు నిర్వహించారు.అనంతరము పేషెంట్లకు కిట్లు,మందులు పంపిణీ చేశారు.
మేయర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యము, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి సంజీవిని లాంటిది అని అన్నారు. ప్రతి కుటుంబానికి వైద్యం ఉచితంగా అందించాలని జగనన్న ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా మంచి వైద్యం అందుతుందని ప్రజలు అభిప్రాయాలు తెలియజేస్తున్నారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారికి మందులు పంపిణీ చేసి వారిని దగ్గర ఉండి వారి ఇంటి వద్దకే చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని తెలియజేశారు. ఇంట్లో నుండి రాని వాళ్లకు వాలంటీర్లు ద్వారా గాని సచివాలయ సిబ్బంది ద్వారా గాని తెలియజేస్తే ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తారని తెలియజేశారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ చారి, రెండో డివిజన్ కార్పొరేటర్ ఉమా యాదవ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అజయ్, నగరపాలక సూపరింటెండెంట్ రవి, సీనియర్ అసిస్టెంట్ హరి మోహన్, సుమతి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.