Free medical camp under Gopu Ramana Reddy
గోపు రమణారెడ్డి అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మల్కాజిగిరి సాక్షిత ప్రతినిధి;-
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో బిజెపి ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్ కన్వీనర్ ఓపెన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గోపు రమణారెడ్డి అధ్వర్యంలో ఓల్డ్ మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఆవరణలో స్థానిక బిజెపి నాయకులు సునీల్ యాదవ్ తో కలిసి ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు.
ఉదయం 10 నుండి 1.30 PM వరకు పీఎం జన్ ఔషధీ కేంద్రం క్యాంపు ప్రైమ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించి క్యాంపులో వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణ చేసిన గోపు రమణారెడ్డి. నిర్వాహకులు గోపు రమణారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక దశలోని బీపీ షుగర్ చెక్ అప్ వల్ల ఏ మోతాదులో షుగర్ లెవెల్ బిపి లెవెల్ ఉన్నాయో చాలామందికి బయటపడుతున్నాయని అటువంటి వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ మందులు రాయడం జరుగుతుంది
ఈ క్యాంపులో దాదాపు 120 మంది ప్రజలకు బీపీ షుగర్ చెక్ అప్ చేసు కోవటం జరిగిందనీ నెలకు దాదాపుగా పది నుండి 12 క్యాంపు నిర్వహిస్తున్నట్లు అలాగే క్యాంపు ల వల్ల ఎంతో ప్రయోజనమని ప్రధానమంత్రి భారతీయ జనశక్తి కేంద్రాలలో మందులు కొనండి డబ్బులు ఆదా చేసుకోమని మోడీ చేపట్టిన పథకాన్ని మల్కాజ్గిరి ప్రాంతంలో దాదాపు 25 జన్ ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి 50 నుండి 90 శాతం అతి తక్కువ ధరలకు మందులు అందిస్తున్నట్లు గోపు రమణారెడ్డి తెలియజేశారు .
అలాగే మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రజలలోకి తీసుకొని పోయి అకౌంట్ ఓపెన్ చేపిస్తానని ప్రాథమిక దశలో అకౌంట్ ఓపెన్ కావలసిన డబ్బులు తన ఎన్జీవో ద్వారా కట్టి పాస్‌బుక్కులు అందిస్తామని. రమణారెడ్డి తెలియజేశారు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.
మల్కాజిగిరి ప్రాంతంలో ఉండే పిఎం జన్ ఔషధీ కేంద్రాలలో సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారమ్స్ ఉంటాయి అప్లికేషన్ ఫారం నింపి ఇస్తే పోస్ట్ ఆఫీస్ లో 250 రూపాయలు కట్టి సంబంధిత మహిళలకి ఈ పాస్ బుక్ అందిస్తామని ఒక ప్రకటనలో గోపురం రమణారెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ,రాజ్యలక్ష్మి , గుప్తా, బిజెపి సీనియర్ నాయకులు సునీల్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు రాంబాబు bjym నాయకులు చందు ,జిల్లెల యాదవ్ పాల్గొన్నారు.