SAKSHITHA NEWS

Free medical camp in Budumuru

బుడుమూరులో ఉచిత వైద్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో విలేజ్ హెల్త్ సెంటర్ వద్ద సర్పంచ్ ప్రతినిధి పెద్దనాయన చిట్టిబాబు,ఎంపిటిసి ప్రతినిధి బొడ్డ రవి ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా డా.సౌమ్య మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రతి ఒక్కరూ వేడినీటిని తాగాలన్నారు.గ్రామంలో అందరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.అనంతరం రోగులకు తనిఖీలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్.పి యమున,ఏఎన్ఎం వరలక్ష్మి,ఆశా కార్యకర్తలు,చిన్నారి,శ్రీకాంత్,అంగన్వాడీ వర్కర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS