నేడు శ్రీశైల దేవస్థానంలో ఉచిత సామూహిక సేవలు ఈఓ లవన్న…
శ్రీశైల దేవస్థానం సాక్షీత ఏప్రిల్: 24:శ్రీశైలం మహా క్షేత్రంలో ధర్మప్రచారంలో భాగంగా ప్రతీమాసములో ఒకసారి దేవస్థానం తెల్లరేషన్కార్డు కలిగిన సామాన్య
భక్తుల కోసం నెలలో ఒకరోజున ఉచిత సామూహిక సేవలను శ్రీశైల దేవస్థానం వారు మొట్టమొదటిసారిగా ఈ ఉచిత సామూహిక సేవలను నిర్వహిస్తుంది ఆర్థికంగా వెనుకబడిన భక్తుల సౌకర్యార్థం ఈ సదుపాయం కల్పించబడిందని
కాగా నేడు మంగళవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక అభిషేకాన్ని చంద్రవతి
కల్యాణమండపంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించడం జరుగుతుందని
ఈ సామూహికసేవలో పాల్గొనదలచిన భక్తులు www. srisailadevasthanam .org ద్వారా నమోదు
చేసుకోవలసివుంటుందని అధికారులు తెలిపారు
ఉచిత టికెట్ పొందు వివరములు
ఈ నెల 19వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని ప్రతీ మాసములో 250 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈ సేవలలో దంపతులు లేదా ఒకరు పాల్గొనవచ్చు
సేవాకర్తలు తప్పనిసరిగా “తెల్లరేషన్ కార్డు” కలిగి ఉండవలెను.
ఆన్లైన్ ద్వారా సేవ నమోదు చేసుకునే సమయంలో భక్తులు వారియొక్క తెల్లరేషన్కార్డు స్కానింగ్ చేసి
ఆప్లోడ్ చేయించుకోవాలని
తెల్లరేషన్ కార్డు లేనివారిని అనుమతి వారికి ఉండదని
అభిషేకానంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా శ్రీస్వామివారి అలంకార దర్శనం మరియు అమ్మవారి దర్శనంతో పాటు శ్రీ వృద్ధమల్లికార్జునస్వామివారి స్పర్శదర్శనం కల్పిచబడుతుందని
సేవాకర్తలకు 2 లడ్డు ప్రసాదాలు, కుంకుమ, విభూతి, కైలాసకంకణాలు, శ్రీశైలప్రభ, కాటన్ కండువా,రవిక వస్త్రం అందజేయబడుతాయని
దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణభవనం నందు భోజన సదుపాయం కూడా కల్పించబడుతుందని భక్తులు సద్వినియోగ పంచుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు
కాగా ఈ సేవలను శ్రీశైల టీవి ద్వారా కూడా వీక్షించవచ్చునీ ఆలయ ఈఓ ఎస్.లవన్న తెలిపారు