ఉచిత కంటి పరిక్ష మరియు కళ్ళద్దాలు పంపిణి శిబిరం.
సాక్షిత, : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మునిసిపాలిటి,డాక్టర్స్ కాలనీలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరిశ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక నాయకులు అక్బర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు అవసరమైన వారికీ కంటి అద్దాలు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా *మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ * పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని,వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ,అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి సేవలను ప్రశంసించారు. ప్రజలందరూ ఇలాంటి సేవలను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి కంటి పరిక్షలు నిర్వహించి, 110 మందికి కంటి అద్దాలు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,అక్బర్ ఖాన్,ఉష, యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, సిపిఐ పర్వీన్,సైఫుద్దీన్,డా.ప్రభాకర్,డిసిసి సెక్రటరీ సాల్మన్ రాజు, మిద్దెల సీతారాంరెడ్డి,క్యాంపు నిర్వాహకులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఉచిత కంటి పరిక్ష మరియు కళ్ళద్దాలు పంపిణి శిబిరం.
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…