ప్రకాశం జిల్లా తర్లుపాడు
Society for Environmental village Activitys (SEVA ) సేవ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక తర్లుపాడు BC హాస్టల్ లోని సుమారు 25 మంది 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు మరియు స్టేషణరీ ని ఉచితంగా పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమం లో సంస్థ డైరెక్టర్ కందుల అనిల్ కుమార్ మాట్లాడుతూ మా తండ్రి SEVA స్వచ్చంద సంస్థ వ్యవస్థపకులు శ్రీ కే పి యేసు గారు ఉపాధ్యాయుడి గా సేవలను అందించి అనేక మందిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాడని , తదనంతరం ఆయన స్ఫూర్తి తో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు, మెడికల్ క్యాంపు లు, అన్న దానం కార్యక్రమాలు, చలి వేంద్రాలు వంటి అనేక సేవ కార్యక్రమలను మా స్వచ్చంద సంస్థ ద్వారా చేపడుతున్నామని తెలియ చేశారు. కార్యక్రమం లో కే.కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం తో చదవాలని, మంచి మార్కులతో పాసై మీ తలిదండ్రుల కలలు నెరవేర్చాలని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో కందుల అనిల్ కుమార్, కే కిరణ్ కుమార్ తో పాటు,హాస్టల్ వార్డన్ ఏడుకొండలు, మరియు హాస్టల్ సిబ్బంది ఆంజనేయయులు, విద్యార్థులు పాల్గొన్నారు..