హైదరాబాద్:
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా సోలిపేట పని చేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సొలిపేట పనిచేశారు. సొలిపేటకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనిలో నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూశారు. ప్రజలు, నేతల సందర్శనార్ధం సొలిపేట రామచంద్రారెడ్డి భౌతికకాయాన్ని నివాసం వద్దే ఉంచనున్నారు సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సొలిపేట మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…