SAKSHITHA NEWS

అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ 131 డివిజన్ లోని సురేందర్ రెడ్డి గార్డెన్ లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రావ్ ఆద్వర్యంలో జరిగిన యోగ డే వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. యోగ తో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని, యోగ ప్రతి రోజు చేయడం ద్వారా ఆరోగ్యం, ఆయుష్షు, బలం చేకూరుతుందని అన్నారు. భారతదేశ యోగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోదీ కే దక్కిందని, నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగ గురువులు ఐల శ్రీధర్ చారి, మక్కెన శ్రీనివాస్, డివిజన్ బీజేపీ నాయకులు నటరాజ్ గౌడ్, కృష్ణ యాదవ్, దయాకర్, విజయ్ గుప్తా, లింగం యాదవ్, అలివేలు, శ్రీధర్, నంద కిషోర్, లక్ష్మా రెడ్డి, నర్సింహా చారి, సత్యం, ముద్దం రవి, రవి గౌడ్, నోముల కరుణాకర్, కిరణ్ యాదవ్, భూషణం, వీరేష్ చారి, రాజేంద్ర ప్రసాద్, నరేందర్, కృష్ణ గుప్తా, రాజశేఖర్, రాజిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS