ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్:
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసు లు జారీ చేసిన విషయం తెలిసిందే.
నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్.. కమిషన్ ఎదుట జరిగిన పరిణామా లను మీడియాకు వివరిం చారు. తాను వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై..
యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నాను అని అంగీకరిం చినట్టు తెలిపారు. ఇప్పటికే ఆ విషయంపై మహిళలకు క్షమాపణ చెప్పినట్లు గుర్తుచేశారు.
అయితే, చట్టాన్ని గౌరవించి మహిళా కమిషన్ ఎదుట హాజరవడానికి తాను వస్తే… కాంగ్రెస్ మహిళా నేతలు జనాన్ని వెంటేసు కుని వచ్చి తన వెంట వచ్చి న మహిళా ప్రజాప్రతినిధుల పై దాడి చేయడం బాధాక రం అన్నారు.
తాను మహిళా కమిషన్ ఎదుట విచారణలో ఉండగా.. భవనం బయట ఉన్న బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ మహిళా నేతలు దాడి చేశారని ఆరోపించారు.
నెయిల్ కట్టర్స్‌తో దాడికి పాల్పడినట్లుగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు తన వద్ద వాపోయారని అన్నారు. పోలీసుల అండ దండలు చూసుకుని కాంగ్రె స్ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.