మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

Spread the love

హైదరాబాద్:
లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల 24 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్‌ పలు జిల్లాల్లో రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు కూడా నిర్వ హించను న్నారు.

నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో 24న సాయంత్రం 5.30 గంటలకు ఆరంభమ య్యే ఈ యాత్ర… వచ్చేనెల 10న సాయంత్రం 6.30 గంటలకు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియ నుంది.

ఈ సందర్భంగా ముఖ్యంగా మూడు అంశాలపై బీఆర్‌ ఎస్‌ అధినేత ఫోకస్‌ చేయ నున్నారు. కేంద్రంలోని బీజే పీ పదేండ్లలో తెలంగాణకు చేసిందేమిటి..? ఇచ్చిందేమి టి..? అని ఆ పార్టీని ఎండగ ట్టటం, అసెంబ్లీ ఎన్నికల్లో హామీనిచ్చిన ఆరు గ్యారం టీలపై కాంగ్రెస్‌ను నిలేయ టం, తెలంగాణకు బీఆర్‌ ఎస్సే శ్రీరామరక్ష అనే విష యాలను ఆయన విడమరి చి చెప్పనున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు ఢిల్లీ నేతలు బాస్‌లు, కానీ బీఆర్‌ఎస్‌కు మాత్రం తెలంగాణ ప్రజలే నిజమైన బాస్‌లనే నినాదాన్ని ఆయన ఎత్తుకోనున్నారు. వీటితోపాటు రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇటీవల కురిసిన అకాల వర్షాలు, పంట నష్టం, ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవటం, ప్రాజెక్టుల్లో నీళ్లున్నా వదల కపోవటం, కరువు పరిస్థితు ల్లో ప్రభుత్వ ఉదాశీనత తదితర సమస్యలను ఆయన రోడ్‌ షోల ద్వారా ప్రజలకు ఏకరువు పెట్టను న్నారు.

లోక్‌సభలో తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలం టూ కేసీఆర్‌ పిలుపునివ్వ నున్నారు.

కేసీఆర్‌ రోడ్‌షోల వివరాలు…24.04.24 నుంచి

ఈనెల 24- సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడ
రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్‌ షో రాత్రి బస

25 -సాయంత్రం 6 గంటలకు భువనగిరి రాత్రి బస ఎర్రవల్లిలో

26-సాయంత్రం 6 గంటలకు మహబూబ్‌ నగర్‌ రాత్రి బస

27-సాయంత్రం 6 గంటలకు నాగర్‌ కర్నూల్‌ హైదరాబాద్‌లో రాత్రి బస

28-సాయంత్రం 6 గంటలకు వరంగల్‌ (రాత్రి బస)

29-సాయంత్రం 6 గంటలకు ఖమ్మం (రాత్రి బస)

30-సాయంత్రం 5.30 గంటలకు తల్లాడ

30-సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో రోడ్‌ షో (రాత్రి బస కొత్తగూడెంలో)

మే నెలలో
01.05.24-సాయంత్రం6 గంటలకు మహబూబాబాద్‌లో రోడ్‌ షో (వరంగల్‌లో రాత్రి బస)

02.05.24-సాయంత్రం 6 గంటలకు జమ్మికుంట వీణవంకలో రాత్రి బస

03.05.24-సాయంత్రం 6 గంటలకు రామగుండం (రామగుండంలో రాత్రి బస)

04.05.24-సాయంత్రం 6 గంటలకు మంచిర్యాల కరీంనగర్‌లో రాత్రి బస

05.05.24-సాయంత్రం 6 గంటలకు జగిత్యాల జగిత్యాలలో రాత్రి బస

06.05.24-సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్‌ నిజామాబాద్‌లో రాత్రి బస

07.05.24-సాయంత్రం 5.30 గంటలకు కామారెడ్డి లొ పర్యటన

Related Posts

You cannot copy content of this page