ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో అనేక పధవులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి క్రితం కాషాయం నీడకు చేరారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటు ఎమ్మెల్యేగా, విప్ గా, చిఫ్ విప్ గా, స్పీకర్ గా, ఆఖరికి ముఖ్యమంత్రి గా అనేక అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ ని వీడి నేడు బీజేపీ కండువా వేసుకున్నారు. ఆయనను డిల్లీలో బీజేపీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ లో తనకు మనుగడ లేకుండా పోయిందని అందుకే తాను బీజేపీ లోకి వెళుతున్నాను అని కొద్ది కాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. అనేక పధవులు ఇచ్చిన పార్టీని ఇప్పటి వరకు కనీసం తన చరిష్మా చూపలేదనే విమర్శలు నల్లారి వారిపై లేకపోలేదు. నాడు కాంగ్రెస్ ను విభేదించి సొంత కూటమి (పార్టీ) ఏర్పాటు చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం తనకు నాడు ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదనే కారణంతోనే పార్టీని వీడారు. ఆ సమయంలో నల్లారి కిరణ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలనే అనేది కొందరి వాధనలు. కాంగ్రెస్ పార్టీ పాతాళంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకుని వచ్చిన వైఎస్ ఫామిలీని కాదని నల్లారికే నాడు కాంగ్రెస్ అధిష్టానవర్గం అందలం ఎక్కిస్తే ఆయన పార్టీకి చేసింది ఏమిటనే ప్రశ్నలు లేకపోలేదు. నాడు వైఎస్ ఫామిలీ పొగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నారు. నాడు వైఎస్ కుటుంబం కాదని అధిష్టానవర్గం అందలం ఎక్కించిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి చేసిన పనులను చూస్తున్నారు. అవకాశం కోసం కొందరు అవసరం కోసం మరి కొందరు పనులు చేస్తే ఇలాంటి పరిణామాలే కళ్ళకు కనిపించే చెరిగిపోని ఘట్టాలు…
మాజీ ముఖ్యమంత్రి నల్లారి బీజేపీ కండువా
Related Posts
లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ
SAKSHITHA NEWS లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూత కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం…
మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…
SAKSHITHA NEWS మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… న్యూఢిల్లీ, : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని..…