వాషింగ్టన్: సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్ కెర్ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.
‘డ్రగ్’ మోతాదు ఎక్కువ కావడంతోనే ట్రోపర్ మరణించి ఉంటాడని ఆయన బామ్మ ఎస్తర్ వోజ్కికీ అనుమానం వ్యక్తం చేశారు. ‘‘అతను డ్రగ్ తీసుకున్నాడు. అందులో ఏముందో మాకు తెలియదు. అది డ్రగ్ అని మాత్రం చెప్పగలం’’ అని తెలిపారు. శవపరీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించారు. అతని మరణంతో తమ కుటుంబం తీవ్ర విశాదంలో మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గణితం పట్ల అతనికి చాలా ఆసక్తి అని.. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవాడని తెలిపారు.
యూట్యూబ్ మాజీ సీఈఓ అనుమానాస్పద స్థితిలో మరణించాడు
Related Posts
కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
SAKSHITHA NEWS కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్ (Gujarat)లోని…
ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
SAKSHITHA NEWS ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్అమెరికాలో నవంబర్ 5న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. ఇక మస్క్‌కు చెందిన ప్రచార సంస్థ అమెరికా ప్యాక్..…