SAKSHITHA NEWS

టీటీడి స్కూల్స్ విజేతలకు తిరుపతి బాలోత్సవం బహుమతులు
సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి బాలోత్సవం సంస్థ ఆధ్వర్యంలో టీటీడీ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ మేరకు బాలోత్సవ సంస్థ ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున ఆధ్వర్యం లో “స్వాతంత్ర పోరాటం – 75 సంవత్సరాల ప్రగతి” అనే అంశంపై వక్తృత్వ పోటీలు, “రాజ్యాంగ గొప్పతనం” అనే అంశంపై వ్యాసరచన పోటీలతో పాటు స్వాతంత్ర పోరాట నాయకుల బొమ్మల డ్రాయింగ్ అంశంపై పోటీలు పెట్టారు. ఈ నేపథ్యంలో విజేతలైన విద్యార్థులకు టీటీడీ స్కూల్స్ లో తిరుపతి బాలోత్సవం నాయకులు నాగార్జున,
ఎస్.రెడ్డెప్ప బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చదవాలంటే పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహించాలన్నారు. నేటి చదువులు ర్యాంకులు, మార్కుల చుట్టే తిరుగుతున్నాయన్నారు. అలాంటప్పుడు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం కష్టమన్నారు. పిల్లల్లోనూ చదువుల పట్ల అసక్తి కల్గించడం, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, సమాజంలో భాద్యతగల్గిన పౌరులుగా, వారిలో దేశభక్తి పెంపొందించడం, మూఢనమ్మకాలకు దూరంగా ఉంచేలా ప్రయత్నం చేయడం తిరుపతి బాలోత్సవం ఉద్దేశంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నాయకులు గురునాధo , మోహనమూర్తి, టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులూ గోల్కొండ వెంకటేశంలు పాల్గొని బహుమతులు, ప్రశంసా పత్రాలు అందచేశారు. హై స్కూల్స్ హెడ్మాస్టర్లు చంద్రయ్య, పద్మావతి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS